ఉప్పల్ స్టేడియంలోHCA ఎన్నికల పోలింగ్

 ఉప్పల్ స్టేడియంలోHCA ఎన్నికల పోలింగ్

ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు వరకు పోలింగ్ నిర్వహిస్తారు.  సాయంత్రం 4 గంటలకు ఎన్నికల కౌంటింగ్  ప్రారంభమవుతుంది. అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. ప్రెసెడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ,, ట్రెజరర్, కౌన్సిలర్ పోస్టులకు ఎన్నికలు జరుగుతున్నాయి. HCA లో మొత్తం 173 ఓట్లు ఉన్నాయి. ఎన్నికల్లో నాలుగు క్రికెట్ అసోసియేషన్ ప్యానెల్స్ పోటీలో పాల్గొంటున్నాయి. 

ఇప్పటివరకు 50 కి పైగా సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ క్రికెటర్స్ వెంకటపతి రాజు, మిథాలి రాజ్, స్రవంతి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

సుప్రీం కోర్టు నియమించిన సింగిల్ మెంబర్ కమిటీ జస్టిస్ లావు నాగేశ్వర రావు, కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ వీఎన్ సంపత్ HCA ఎన్నికలు నిర్వహిస్తున్నారు.  ఈ ఎన్నికల్లో గెలుపుపై ఆయా ప్యానెల్స్ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.