ఇండిగో ఫ్లైట్​కు బాంబు బెదిరింపు

ఇండిగో ఫ్లైట్​కు బాంబు బెదిరింపు

తాను ఎక్కాల్సిన ఫ్లైట్​లో బాంబు ఉందని ఫోన్​చేశాడో ప్రబుద్ధుడు.. ఆ ఫోన్​కాల్​తో ఎయిర్​పోర్ట్ లో గందరగోళం నెలకొని ప్రయాణికులు టెన్షన్ పడుతుంటే, ఎయిర్​పోర్ట్​క్యాంటీన్​లో తీరిగ్గా కూర్చుని చోద్యం చూశాడు. శనివారం శంషాబాద్​ఎయిర్​పోర్ట్​లో కలకలం రేపిన ఈ ఘటన వివరాలు.. ఇండిగో ఫ్లైట్​లో బాంబు ఉందని ఓ ఆగంతకుడు ఫోన్​లో బెదిరించాడు. దీంతో ఎయిర్​పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. చైన్నై వెళ్లాల్సిన ఫ్లైట్​ను ఆపి బాంబ్​స్క్వాడ్​తో క్షుణ్ణంగా చెక్​చేశారు. మిగతా విమానాలను, ఎయిర్​పోర్ట్​లాంజ్​లోనూ చెకింగ్​జరిపారు. సీఐఎస్ఎఫ్​ సిబ్బంది డాగ్​స్క్వాడ్​తో పరిశీలించింది. ఈ తతంగంచూసి ప్రయాణికులు ఆందోళనచెందారు. పూర్తిగా చెక్​చేసినా బాంబు దొరకకపోవడంతో ఫోన్​కాల్​ఫేక్​అని తేల్చారు. దీనిపై పోలీసులు ఎంక్వైరీ చేసి, ఎయిర్​పోర్ట్​క్యాంటీన్​లో కూర్చున్న విశ్వనాథం అనే యువకుడిని అరెస్టు చేశారు. తమిళనాడుకు చెందిన విశ్వనాథ్ ఆఫీసు పనిమీద సికింద్రాబాద్​కు వచ్చాడు. తిరిగి చెన్నై వెళ్లేందుకు శంషాబాద్​ఎయిర్​పోర్టుకు వచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న విశ్వనాథ్​ఫ్లైట్​ఎక్కడానికి బదులు ఫోన్​చేసి విమానంలో బాంబు ఉందని బెదిరించాడని పోలీసులు చెప్పారు. విశ్వనాథ్​పై కేసు నమోదు చేసి, రిమాండ్​కు తరలించారు.