సీపీ పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్

సీపీ పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్
  • సీపీ పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్
  • ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేయొద్దని సీపీ సూచన
  • సైబర్ క్రైం పోలీసులకు సమాచారమిచ్చినట్లు వెల్లడి 

సిద్ధిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట సీపీ ఎస్ఎం. విజయ్ కుమార్ పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ తెరిచి అమాయక ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సీపీ ఫొటో ఉండడంతో పలువురు సిద్దిపేట జిల్లా ప్రజలు ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడంతో యాక్సెప్ట్ చేయడంతో పాటు, ఆ అకౌంట్ లో వచ్చే ఫొటోలకు. పోస్టులకు లైక్ కొట్టడంతో పాటు, కామెంట్స్ కూడా పెడుతున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు మేసేంజర్ లో వాళ్లకు మేసేజ్ చేస్తూ, వారి ఫోన్ నంబర్లఋను అడుగుతూ మోసం చేసేందుకు యత్నిస్తున్నారు.

 ఈ విషయం సీపీ దృష్టికి వెళ్లడంతో ఆయన సిబ్బందితో పాటు, ప్రజలను అప్రమత్తం చేశారు. తన పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేయొద్దని, జిల్లా ప్రజలందరూ ఫేస్ బుక్ లో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పేరుతో ఉన్న అకౌంట్ ను మాత్రమే ఫాలో కావాలని సూచించారు. నకిలీ అకౌంట్ పై సైబర్ క్రైం పోలీసులకు సమాచారమిచ్చినట్లు సీపీ తెలిపారు.