ఫేక్‌ ఫింగర్స్‌‌.. నిజమేనా?

ఫేక్‌ ఫింగర్స్‌‌.. నిజమేనా?

ఎన్నికల వేడిలో ఇంటర్నెట్‌ మొత్తం రకరకాల పోస్టులతో తడిసిపోతోంది. ఈ క్రమంలో ఫేక్‌ ఫింగర్స్‌ పేరిట గత రెండుమూడు రోజులుగా ఒక ఫోటో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ట్విట్టర్‌‌, ఫేస్‌ బుక్‌ లోఈ ఫొటోలను కొందరు షేర్‌‌ చేస్తున్నారు. దీంతో లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో బోగస్‌ ఓట్ల కోసం కొన్ని పార్టీలు వీటినిఉపయోగించబోతున్నారంటూ కథనాలువెలువడ్డాయి. దీంతో వాట్సాప్‌ లో ఫేక్‌ఫింగర్స్‌ పై ప్రచారం జోరుగా సాగుతోంది.

రివర్స్‌‌ ఇమేజ్‌ తేల్చిన గుట్టు
ఫేక్‌ ఫింగర్స్‌ ఫొటోలను కొందరు రివర్స్‌ ద్వారా ఇంటర్నెట్‌ లో సెర్చ్‌‌ చేసి.. అవిజపాన్‌ కు చెందిన ఫొటోలుగా గుర్తించారు.ఏబీసీ న్యూస్‌ రి పోర్ట్‌‌ ప్రకారం 2013లో ఆఫొటోలు వైరల్‌ అయ్యాయి. జపాన్‌ కు చెందినకరడుగట్టిన గ్యాంగ్‌‌స్టర్స్‌ గ్రూప్‌ ‘యజుకా’. ఈముఠా మాజీ సభ్యులు నేర ప్రవృత్తిని వదిలేసి సాధారణ జీవితం గడిపేందుకు, ఐడెంటిటీని మార్చుకునేందుకు ఈ ప్రోస్తెటిక్‌ ఫింగర్స్‌ను అప్పట్లో ఉపయోగించారు. షింటారో హయాషీ అనే వ్యక్తి వీటిని తయారు చేశాడు. ఆ ఫొటోలే ఇప్పుడు ఇంటర్నెట్‌ లో వైరల్‌ అవుతున్నాయి. గతంలో యూపీ ఎన్ని కలకు ముందు ఓమీడియా సంస్థ ఫేక్‌ ఫింగర్లపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం కలకలం రేపింది. సిలికాన్‌ఫింగర్ల సాయంతో కొన్ని రాజకీయ పార్టీలు రిగ్గింగ్‌‌కు పాల్పడే అవకాశం ఉందని ఆ కథనం పేర్కొంది. అయితే ఫింగర్‌‌ డిస్ట్రి బ్యూటర్లు మాత్రం ఆ ఆరోపణల్ని ఖండించారు