శ్రీవారి సన్నిధిలో పట్టుబడ్డ నకిలీ IPS ఆఫీసర్

శ్రీవారి సన్నిధిలో పట్టుబడ్డ నకిలీ IPS ఆఫీసర్
  • ఐపీయస్ అధికారినంటూ ఫ్రోటోకాల్ దర్శనానికి అప్లై
  • దర్శనం కోసం వెళుతుండగా అరెస్ట్ చేసిన పోలీసులు
  • సదరు వ్యక్తి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి

తిరుమల: తానొక IPS ఆఫీసర్ అని చెప్పి తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు పొందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు తిరుమల పోలీసులు. సదరు వ్యక్తి అరుణ్ కుమార్ అనబడే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఐపీయస్ అధికారినంటూ జేఈఓ  కార్యాలయంలో ఫ్రోటోకాల్ దర్శనానికి అప్లై చేశాడు అరుణ్ కుమార్. విచారణలో నకిలీ IPS అధికారిగా భావించి, విజులెన్స్ కు సమాచారం అందించారు JEO కార్యాలయ అధికారులు. దీంతో దర్శనానికి వెళుతున్న సమయంలో తనిఖీలు చేసిన TTD విజిలెన్స్ సిబ్బంది.. అరుణ్ కుమార్ ఫేక్ ఐడెంటిటి కార్డుతో టికెట్లు పొందినట్లు గుర్తించారు. అరుణ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న తిరుమల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అరుణ్ కుమార్ స్వస్థలం ఖమ్మం కాగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నట్లు చెప్పారు పోలీసులు. గతంలో పలువురు రాష్ట్ర మంత్రులు వద్ద  అరుణ్ కుమార్ OSD గా పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రోటోకాల్ పరిధిలోకి రానివారు ఎవరైనా నకిలీ కార్డులతో టికెట్లు పొందడం నేరమని చెప్పారు.

Fake IPS officer arrested while going to Srivari darshan at Thirumala