- రూ.8 లక్షల విలువైన మెషీన్లు, మెహందీ స్వాధీనం
బషీర్‌బాగ్, వెలుగు: బాలాపూర్‌లో నకిలీ కరాచీ మెహందీ కోన్‌ల తయారీ, సరఫరా చేస్తున్న కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి సుమారు రూ.8 లక్షల విలువైన యంత్రాలు, నకిలీ మెహందీని స్వాధీనం చేసుకున్నారు. బాలాపూర్‌లోని మినార్ కాలనీలో అక్రమంగా యూనిట్ ఏర్పాటు చేసి కరాచీ మెహందీ పేరుతో నకిలీ కోన్‌లు తయారు చేసి, హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాలకు సరఫరా చేస్తున్నారు.
విషయం తెలుసుకున్న సౌత్-ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బాలాపూర్, అఫ్జల్‌గంజ్ పోలీసులతో కలిసి మినార్ కాలనీలోని తయారీ కేంద్రంతో పాటు అఫ్జల్‌గంజ్‌లోని ఎస్‌కేఎస్ ట్రావెల్స్ అండ్ కార్గోపై దాడులు చేశాడు. నకిలీ మెహందీ తయారు చేసి సరఫరా చేస్తున్న మహ్మద్ ఆసిఫ్ (48), దీపక్‌కుమార్ (25)ను అదుపులోకి తీసుకున్నారు. 8,400 నకిలీ మెహందీ కోన్‌లు, మెషీన్లు, కెమికల్స్, ప్యాకింగ్ సామగ్రి, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏడీసీపీ అందే శ్రీనివాస రావు తెలిపారు.
