భైంసా, వెలుగు: భైంసా పట్టణాభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని ఎమ్మెల్యే రామారావు పటేల్అన్నారు. భైంసాలోని తన నివాసంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. పట్టణంలోని కాలనీల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి యూఐడీఎఫ్ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కలిపి రూ.28 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. పైప్ లైన్లతో పాటు ట్యాంకుల నిర్మాణం చేపడతామన్నారు.
అమృత్ మహోత్సవ్ రూ.2.14 కోట్ల నిధులతో పురాతన మహాదేవ్ మందిర్ చెరువును ఆధునికీకరిస్తామని పేర్కొన్నారు. చెరువులోకి మురికి నీరు చేరకుండా చర్యలు తీసుకొని మహాదేవ్ మంది రాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తామన్నారు. నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీకి, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బి.గంగాధర్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు రావుల రాము, సీనియర్ నాయకులు సొలంకి భీంరావ్, సాంవ్లీ రమేశ్, వెంగల్ రావ్, గాలిరాజు, మధు పటేల్ తదితరులు పాల్గొన్నారు.
