రూ. 500లకే గ్యాస్ సిలిండర్ పై ఫేక్ ప్రచారం

రూ. 500లకే గ్యాస్ సిలిండర్ పై ఫేక్ ప్రచారం

రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల ఈకేవైసీపై తప్పుడు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈకేవైసీ చేయించుకుంటేనే రూ.500లకు గ్యాస్ సిలిండ్ ఇస్తారంటూ ఫేక్ న్యూస్ సర్కిలేట్ అవుతోంది. దదీంతో చాలా మంది ఏజెన్సీలకు క్యూ కట్టి ఈకేవైసీ చేయించుకుంటున్నారు. ఒక్కసారిగా జనాలు భారీగా రావడంతో సర్వర్లు మొరాయిస్తున్నాయి. దీంతో రోజంతా వెయిట్ చేసినా ఈకేవైసీ పూర్తి కావడం లేదు.

రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల సబ్సీడిపై జరుగుతున్న ఫేక్ ప్రచారంతో   జనాలు ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు.  త్వరగా కేవైసీ చేయించుకుంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 500లకు గ్యాస్ సిలిండర్ ఇస్తుందని సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్  వైరల్ అవుతోంది.దీంతో సిటీలోని చాలా చోట్ల గ్యాస్ కస్టమర్లు ఏజెన్సీలకు క్యూ కట్టారరు.  పనులన్నీ పక్కన పెట్టి గ్యాస్ పాస్ బుక్, ఆధార్ కార్డులతో మీ సిటీలోని పలు ఏజెన్సీల దగ్గర గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. 

అర్హులైన లబ్దిదారులకే  గ్యాస్ సిలిండర్లను సబ్సీడీ అందించాలని కేంద్రప్రభుత్వం భావించింది. అనర్హులకు అడ్డకట్ట వేసేందుకే కేవైసీని అప్ డేట్ చేయాలని రెండు వారాల క్రితం ఆదేశించింది. ఆయా బాధ్యతలను గ్యాస్ ఏజెన్సీలకు  అప్పజెప్పింది. ఇందులో భాగంగా డీలర్లు తమ దగ్గర సిలిండర్లు తీసుకునే వారు  ఈకేవైసీలో భాగంగా ఆధార్ కార్డు తీసుకుని.. థంబ్ తో పాటు  ఫోటో అప్ డేట్ చేసుకోవాలని  సూచించింది. దీనిపై ఎలాంటి గడువు లేదు. ఈ విషయం తెలియక చాలా మంది క్యూ లైన్లో వేచి చూస్తున్నారు.