నకిలీ రెవెన్యూ పత్రాల దందా.. మాజీ వీఆర్వో అరెస్ట్

నకిలీ రెవెన్యూ పత్రాల దందా.. మాజీ వీఆర్వో అరెస్ట్

వరంగల్ : నకిలీ రెవెన్యూ పత్రాలను తయారు చేస్తున్న నెక్కొండకు  చెందిన  మాజీ వీఆర్వో మద్ది వెంకటరెడ్డి ( 70),  లక్వచర్ల రఘులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకట్ రెడ్డి  గతంలో వీఆర్వో గా పనిచేసిన  అనుభవంతో ఈజీ మనీ కోసం నకిలీ రెవెన్యూ డాక్యుమెంట్స్ తయారు చేస్తూ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. 

నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆర్డీఓకు సంబంధించిన సకిలీ ల్యాండ్ కన్వర్షన్ ప్రొసీడింగ్స్,  తహసీల్దార్, ఆర్డీవోలకు సంబంధించిన నకిలీ ముద్రణలు, పహాణీలు, కొటేషన్లు, బ్యాంకు చలాన్లు, గ్రామ నక్షాలు, స్టాంపు పేపర్లను అతడి వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.