కల్తీ విత్తనాల’పై పీడీ యాక్ట్‌‌

కల్తీ విత్తనాల’పై పీడీ యాక్ట్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: కల్తీ విత్తనాలు, నారు సరఫరా చేస్తే పీడీ యాక్ట్‌‌ అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి హెచ్చరించారు. కల్తీ విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం విత్తన, నర్సరీ చట్టంపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. కూరగాయలు, మిరప నారు సరఫరా చేస్తున్న నర్సరీ యజమానులకు బుధవారం హైదరాబాద్ నాంపల్లిలో ఉద్యాన శాఖ శిక్షణ సంస్థలో అవగాహన సదస్సు జరిగింది. పార్థసారథి మాట్లాడుతూ, నకిలీ విత్తనాలపై కఠిన నిబంధనలు, శిక్షలు అమలు చేస్తామన్నారు. పోలీస్ , వ్యవసాయ అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. నర్సరీ యజమానులు నారు పెంపకం, నాణ్యతలో అలసత్వం ప్రదర్శించకుండా జాగ్రతలు తీసుకోవాలన్నారు.  నర్సరీల్లో రికార్డులు నిర్వహించాలని ఉద్యానశాఖ డైరెక్టర్  వెంక్రటామ్‌‌రెడ్డి ఆదేశించారు.

బీటీ కాటన్‌‌పై యాక్షన్‌‌ ప్లాన్‌‌

రాష్ట్రంలో పత్తి సాగులో గులాబీ రంగు పురుగును అరికట్టేందుకు వ్యవసాయ శాఖ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలో యాక్షన్ ప్లాన్ అమలు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.