శ్రీశైలం పేరుతో నకిలీ వెబ్‎సైట్లు.. భక్తులను నిలువునా ముంచుతున్న కేటుగాళ్లు

శ్రీశైలం పేరుతో నకిలీ వెబ్‎సైట్లు.. భక్తులను నిలువునా ముంచుతున్న కేటుగాళ్లు

హైదరాబాద్: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయం పేరిట రోజుకొక నకిలీ వెబ్‎సైట్లు పుట్టుకొస్తున్నాయి. నకిలీ వెబ్‎సైట్ల బారిన పడి భక్తులు మోసపోతున్నారు. శ్రీశైలంలో వసతి గృహాల టికెట్ల కోసం శ్రీశైల దేవస్థానం ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇదే అదనుగా భావించిన కేటుగాళ్లు నకిలీ వెబ్‎సైట్లు ద్వారా భక్తులను బురిడి కొట్టించి డబ్బులు దండుకుంటున్నారు. 

గత కొన్ని రోజుల క్రితం మల్లికార్జున సదన్ అనే నకిలీ వెబ్‎సైట్లో మహారాష్ట్రకు చెందిన భక్తులు మోసపోయారు. అలాగే.. నల్గొండకు చెందిన ఒక భక్తుడు, నార్త్ ఇండియాకు చెందిన మరో భక్తుడు కూడా ఇలాగే మోసపోయారు. చివరకు బెంగుళూరుకు చెందిన ఒక ఆర్మీ ఆఫీసర్ కూడా ఫేక్ వెబ్‏సైట్ బారినపడ్డారు.

ఫేక్ వెబ్‎సైట్లతో శ్రీశైలం మల్లన్న భక్తులు బెంబెలెత్తుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ శ్రీశైలం మండల అధ్యక్షులు చదువుల శ్రీను నకిలీ వెబ్సైట్లో బాధితులను స్వయంగా కలిసి విషయాలు తెలుసుకున్నారు. నకిలీ వెబ్సైట్లపై సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే నకిలీ వెబ్సైట్లో ద్వారా మోసపోయే భక్తులు ఎక్కువైపోతారని అన్నారు.