ఫలక్‌నుమా సిండికేట్ బ్యాంకులో ఏటీఎం చోరీకి యత్నం

ఫలక్‌నుమా సిండికేట్ బ్యాంకులో ఏటీఎం చోరీకి యత్నం

హైదరాబాద్‌: నగరంలోని ఫలక్‌నుమాలో ఏటీఎం చోరీకి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. శంషీర్ గంజ్ ప్రాంతంలోని సిండికేట్‌ బ్యాంక్‌ ఏటీఎంలో చోరీకి యత్నిస్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు.

ఆదివారం అర్ధరాత్రి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంక్ లోనికి వెళ్లడం గమనించిన పోలీసులు… అనుమానంతో వారిని విచారించగా ముగ్గురూ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు.

నిందితులు ముబీన్, కాసిమ్ అలీ,సాజిద్ లను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి గ్యాస్ కట్టర్,చోరీకి ఉపయోగించే వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరైన మొబీన్‌ గతంలో నిజాం మ్యూజియంలో చోరీ చేసినట్లు తెలిసింది.  ఈ చోరీ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.