9 ఏoడ్లల్లో లిక్కర్ పాలసీతో కుటుంబాలు ధ్వంసం

9 ఏoడ్లల్లో లిక్కర్ పాలసీతో కుటుంబాలు ధ్వంసం

లిక్కర్ ​వ్యాపారాన్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రోత్సహిస్తున్నది రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఏటా రూ.8వేల కోట్లు ఉన్న ఉన్న లిక్కర్​ఆదాయం.. ఏడాదికి రూ.45 వేల కోట్లకు చేరేలా కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసింది. ముఖ్యంగా బెల్ట్ షాపులు, వైన్ షాపులు, బార్ రెస్టారెంట్లు, పబ్బులు రాష్ట్రమంతా విస్తరించే విధానాలు అవలంభించింది. 

ఈ విషయంలో మాజీ సీఎస్​సోమేశ్ కుమార్ కృషి ఎంతో ఉందని చెప్పవచ్చు. మద్యం వ్యాపారం విస్తరించడం వల్ల సమాజం ఎంత విధ్వంసానికి గురి అవుతుందో వేరే చెప్పనవసరం లేదు. రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని పెంచుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్  వ్యాపారాన్ని ఎంతో ప్రోత్సహిస్తున్నది. కొత్త జిల్లాలు, కొత్త మండలాలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు కానీ రైతుల వ్యవసాయ భూములన్ని చెక్కలు ముక్కలై సాగుకు దూరమయ్యాయి.

- ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ