కుటుంబం కోసమే మహిళలు వ్యాపారంలోకి

కుటుంబం కోసమే మహిళలు వ్యాపారంలోకి
  • చిన్న పట్టణాల మహిళా వ్యాపారవేత్తలను మోటివేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తోంది ఫ్యామిలీనే
  • ప్రభుత్వ ఫైనాన్షియల్  స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల గురించి తెలియదన్న 97 శాతం మంది
  • అప్పు తీసుకోవడం ఈజీగా మారింది
  • వెల్లడించిన టైడ్ ఇండియా సర్వే

న్యూఢిల్లీ: చిన్న పట్టణాల్లోని మహిళా వ్యాపారవేత్తలకు తమ కుటుంబమే అతిపెద్ద మోటివేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంది. టైర్ 2, చిన్న పట్టణాల్లోని మహిళా వ్యాపారవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలపై   బిజినెస్ ఫైనాన్షియల్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  టైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓ సర్వే చేసింది. మొత్తం 1,20‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంది బిజినెస్ ఓనర్ల అభిప్రాయాలను సేకరించి  రిపోర్ట్ విడుదల చేసింది.  ఈ సర్వే ప్రకారం, తమ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను డెవలప్ చేసుకోవడంలో మెంటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ సాయపడిందని 63 శాతం మంది  రెస్పాండెంట్లు పేర్కొన్నారు. 

తమ కుటుంబాలకు మంచి భవిష్యత్ అందించాలని అనుకుంటున్నామని 31 శాతం మంది, అదనపు సంపాదనతో  ఫ్యామిలీకి సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలవాలనుకుంటున్నామని 28 శాతం మంది వెల్లడించారు. బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మొదలు పెట్టడానికి ఫ్యామిలీనే ప్రధాన కారణమని 78 శాతం మంది చెప్పారు. తమ సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫ్యామిలీ పాత్ర కీలకంగా ఉందని 77 శాతం మంది అన్నారు. అప్పు  ఈజీగా పొందగలిగామని  52 శాతం మంది,  ఇబ్బందులు ఎదుర్కొన్నామని 47 శాతం మంది రెస్పాండెంట్లు పేర్కొన్నారు.

 సుమారు 97 శాతం మంది మహిళా వ్యాపారవేత్తలకు ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఇనీషియేటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల  గురించి తెలియదని టైడ్ సర్వే  పేర్కొంది.  దీంతో అప్పు కోసం ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు వీరు చూడాల్సి వస్తోందని తెలిపింది.  ప్రభుత్వం తెచ్చిన  ఫైనాన్షియల్ స్కీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తమ బిజినెస్ జర్నీ ఈజీగా మారుతుందని 80 శాతం మంది  మహిళా వ్యాపార వేత్తలు భావిస్తున్నారు. 

 బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్ట్ చేయడంలో మెంటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ సాయపడిందని 63 శాతం మంది చెప్పినప్పటికీ,  90 శాతం మంది తమ బంధువులు, ఫ్రెండ్స్ లేదా తెలిసిన వారిని తమ  మెంటార్లుగా పేర్కొన్నారు. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అవగాహన ఉండడం చాలా కీలకమని 80 శాతం మంది మహిళా వ్యాపారవేత్తలు భావిస్తుండగా, డిజిటల్ టూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వాడడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని  51 శాతం మంది వెల్లడించారు. 

వోకల్ ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఓటు

 లోకల్ మార్కెట్లపై ఫోకస్ పెట్టేందుకు  చిన్న పట్టణాల్లోని మహిళా వ్యాపారవేత్తలు ప్రాధాన్యం ఇస్తున్నారు. వోకల్ ఫర్ లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పిలుపును ఇస్తున్నారు.  టైడ్ సర్వే ప్రకారం, సుమారు 38 శాతం మంది కస్టమర్లను చేరుకోవడం ఈజీ అని భావిస్తున్నారు. 31 శాతం మంది  లోకల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ముందొచ్చిన వారికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని అన్నారు. 

తమ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను విస్తరించడంలో సంప్రదాయబద్దమైన అడ్డంకులు ఏం లేవని మహిళా వ్యాపారవేత్తలు పేర్కొన్నారు. దీనిని బట్టి పనిచేస్తున్న మహిళలకు సమాజంలో సపోర్ట్ పెరుగుతోందని  టైడ్ పేర్కొంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవడంలో  మహిళా వ్యాపారవేత్తలు ఇబ్బందులు పడుతున్నారు. బెటర్ సపోర్ట్ సిస్టమ్ కావాలంటున్నారు.