ఇంద్ర భవనం లాంటి బస్సు.... డబుల్ డెక్కర్ ఇళ్లు

ఇంద్ర భవనం లాంటి బస్సు....  డబుల్ డెక్కర్  ఇళ్లు

ఇళ్లు అనేది శాశ్వత చిరునామా. ప్రతీ వ్యక్తి  తన ఇంటిని తనకు నచ్చిన విధంగా నిర్మించుకోవాలని కలలు కంటాడు. అయితే ఇది కొందరికి సాధ్యం అవుతుంది..మరి కొందరికి సాధ్యం కాదు. కొందరు ఇళ్లు లేని వాళ్లు..అద్దె ఇంట్లో జీవితాన్ని గడుపుతారు. వీరు ఎప్పటికైనా సొంత ఇళ్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే అమెరికాలోని ఓ కుటుంబం సొంత ఇంటిని విభిన్నంగా నిర్మించుకుంది. సొంత స్థలం లేని ఆ కుటుంబం..బస్సునే ఇళ్లుగా మార్చేసుకుంది. 


 
బస్సులో 8 మంది...

ది సన్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం  డేన్ ఐయర్లీ  అతని భార్య , వారి 6 మంది పిల్లలు కలిసి డబుల్ డెక్కర్ బస్సులో నివసిస్తున్నారు. వీరికి సొంత స్థలం లేదు. దీంతో ఆ కుటుంబం డబుల్ డెక్కర్ బస్సునే ఇళ్లుగా మార్చేసుకుంది. డేన్ ఐయర్లీ అనే వ్యక్తి తన భార్య, పిల్లల కోసం డబుల్ డెక్కర్ బస్సును ఇళ్లుగా తీర్చిద్దాడు. బస్ హౌజ్ అంటే నార్మల్ గా ఉండదు. సాధారణ ఇంట్లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో  ఈ బస్ హౌజ్ లో అంతకంటే ఎక్కువే ఉన్నాయి.  తమ పిల్లల కోసం ప్రత్యేకమైన బెడ్ రూంలు, బాత్రూమ్ తో పాటు..కిచెన్, హాల్ వంటి గదులున్నాయి. అంతేకాకుండా వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు. 

ఇన్ స్టాలో పోస్టులు..

 డేన్ ఐయర్లీ కుటుంబం ఇదే బస్సులు పర్యటనలకు వెళ్తుంది. దీంతో అతను ఇన్ స్టాలో డబుల్ డెక్కర్ ఫామ్ (@doubledeckerfam) పేరుతో ఒక ఖాతాను ఓపెన్ చేశాడు.  అందులో తన కుటుంబ సరదా పర్యటనలు, బస్ హౌస్‌కి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూనే ఉంటాడు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. 

ట్రోల్..

డేన్ ఐయర్లీ కుటుంబ జీవనశైలిని  ఇష్టపడని కొందరు ప్రజలు  ట్రోల్ చేస్తున్నారు. కొందరైతే పిల్లల గదులను శవపేటికలతో పోల్చారు. ఎంత మంత్రి ట్రోల్ చేసినా..ఎవరెన్ని విమర్శలు చేసినా డేన్ ఐయర్లీ మాత్రం వాటిని పట్టించుకోడు.