కళ్యాణి వచ్చా వచ్చా.. పంచ కళ్యాణి తెచ్చా 

కళ్యాణి వచ్చా వచ్చా.. పంచ కళ్యాణి తెచ్చా 

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురాం తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ఇప్పటికే ‘నందనందనా’ అనే పాటను విడుదల చేసిన మేకర్స్, మంగళవారం రెండో పాటను లాంచ్ చేశారు. ‘ధమకు ధమా ధమారీ.. చమకు చమా చమారీ.. సయ్యారీ సరాసరి.. మొదలు పెట్టేయ్ సవారీ’ అంటూ సాగిన ఈ పాటను గోపీసుందర్ కంపోజ్ చేయగా.. మంగ్లీ, కార్తీక్ పాడారు.

‘కళ్యాణి వచ్చా వచ్చా.. పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా.. సింగారీ చేయందించా.. ఏనుగు అంబారీ సిద్ధంగుంచా..’ అంటూ అనంత శ్రీరామ్ రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. పెండ్లి వేడుకల నేపథ్యంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జంటపై చిత్రీకరించారు. పాటలో వీళ్లిద్దరి కెమిస్ట్రీ ఇంప్రెస్ చేసింది. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్.  ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.