‘కార్తికేయ 2’లో అనుపమ్ ఖేర్

‘కార్తికేయ 2’లో అనుపమ్ ఖేర్

బాలీవుడ్‌‌‌‌లోని గ్రేట్ ఆర్టిస్టుల్లో అనుపమ్ ఖేర్ ఒకరు. ‘ద కశ్మీర్ ఫైల్స్’ మూవీ చూశాక దేశవ్యాప్తంగా ఎంతోమంది ఆయనకు అభిమానులైపోయారు. అలాంటి అనుపమ్ టాలీవుడ్‌‌‌‌లో అడుగుపెట్టారు. ‘కార్తికేయ 2’లో కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు మరో సినిమాలోనూ అనుపమ్ నటిస్తున్నారంటూ సర్‌‌‌‌‌‌‌‌ప్రైజింగ్ న్యూస్ బైటికొచ్చింది. రవితేజ హీరోగా వంశీ డైరెక్షన్‌‌‌‌లో రూపొందుతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’లో ఒక ముఖ్యమైన పాత్ర చేయడానికి ఆయన ఎస్ చెప్పారు. ఈ విషయాన్ని టీమ్ నిన్న అఫీషియల్‌‌‌‌గా అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా రిలీజ్‌‌‌‌ చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌లో కాన్ఫరెన్స్ టేబుల్‌‌‌‌ ముందు ఫైల్స్ స్టడీ చేస్తూ కనిపిస్తున్నారు అనుపమ్. దాన్ని బట్టి టైగర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్ అయ్యుండొచ్చనిపిస్తోంది. 

డెబ్భైల కాలంలో స్టూవర్ట్‌‌‌‌పురంలో సంచలనం సృష్టించిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఇది. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ‘కశ్మీర్‌‌‌‌‌‌‌‌ ఫైల్స్‌‌‌‌’ని ప్రొడ్యూస్ చేసింది కూడా ఈయనే. బహుశా ఆ పరిచయంతోనే తాను తీస్తున్న కార్తికేయ 2, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలకు అనుపమ్‌‌‌‌ను తీసుకుని ఉండొచ్చు. ఆయన కూడా అభిషేక్‌‌‌‌తో ఉన్న క్లోజ్‌‌‌‌నెస్ కారణంగానే బ్యాక్ టు బ్యాక్ రెండు తెలుగు సినిమాలకు ఓకే చెప్పి ఉండొచ్చు. ఏదేమైనా అనుపమ్ ఖేర్ లాంటి వెర్సటైల్ యాక్టర్‌‌‌‌‌‌‌‌ నటిస్తున్నారంటే ఆ సినిమాలకి అడిషనల్ వేల్యూ యాడ్ అయినట్టే.