సముద్రపు కోతతో కుప్పకూలిన డార్విన్ ఆర్చ్

సముద్రపు కోతతో కుప్పకూలిన డార్విన్ ఆర్చ్

స‌హ‌జ‌మైన రాతి తోరణం డార్విన్ ఆర్చ్. ఇది స్కూబా డైవర్లు, ఫోటోగ్రాఫర్లు, క్రూయిజ్-షిప్ పర్యాటకులకు ఎంతో ఫేవరెట్ స్పాట్. దక్షిణ పసిఫిక్ సముద్రంలోని గాలాపోగోస్ ద్వీపకల్పంలోని డార్విన్ ఆర్చ్ ఇవాళ(శుక్రవారం) 11.20 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ విషయాన్ని ఈక్వెడార్ పర్యాటక శాఖ అధికారులు ప్రకటించారు. మొన్నటివరకూ రెండు స్తంభాలతో పైన తోరణం ఆర్చ్ లా అలరించిన ఈ కట్టడం ఇప్పుడు వెలవెలబోయినట్టుగా కనిపిస్తోంది. అయితే రెండు వైపులా స్తంభాలుగా క‌నిపించే భాగం మాత్రం అలాగే ఉంది. తూర్పు ద్వీపానికి 600 మైళ్ల దూరంలో ఉన్న ఈ ఆర్చ్ కుప్పకూలిపోవడానికి సముద్రపు సహజ కోత కారణమంటున్నారు నిపుణులు. 

ఇది ఒకప్పుడు డార్విన్ ద్వీపంలో భాగ‌మ‌ని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రాకృతిక‌ నిర్మాణానికి ప్ర‌ముఖ జీవశాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ పేరు పెట్టారు. యునెస్కో గుర్తించిన‌ ప్రపంచ వారసత్వ సంప‌ద‌ జాబితాలో ఈ డార్విన్ ఆర్చ్ కి స్థానం క‌ల్పించారు.డార్విన్ ద్వీపం నుండి ఇది కిలోమీటర్ కన్నా తక్కువ దూరంలో.. సముద్రం మధ్యలో ఉంటుంది.