
పెండ్లికూతురు ముస్తాబుకి పట్టీలు కొత్త కళ తెస్తాయి. ముఖ్యంగా మీనాకారి పట్టీలు పెట్టుకుంటే మహాలక్ష్మి నడిచొచ్చినట్టే ఉంటది. అందుకే వీటికి పెండ్లికూతురు పట్టీలని పేరుంది. కొందరు బారాత్ పట్టీలని కూడా అంటుంటారు. ఈ రాజస్తానీ ఫేమస్ పట్టీల స్పెషాలిటీ ఏంటంటే.. ఎనామిల్ ఆర్ట్. రకరకాల జంతువులు, పక్షుల బొమ్మలు, రంగురంగుల పూసలు, కుందన్స్తో తయారుచేసే ఈ పట్టీలు పెండ్లి కూతురికి పర్ఫెక్ట్ ఛాయిస్. అందుకే వాటిల్లో కొన్ని మోడల్స్ మీకోసం. ఇవి ఐదొందల రూపాయల పైనుంచి దొరుకుతున్నాయి.