ఆర్యన్ ఖాన్ తో ఫ్యాన్స్‌‌ సెల్ఫీలు

ఆర్యన్ ఖాన్  తో ఫ్యాన్స్‌‌ సెల్ఫీలు

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ‘ఆర్యన్ ఖాన్’కు ఫాలోయింగ్ అధికంగానే ఉంది. ముంబాయి ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆయన్ను కలిసేందుకు, సెల్ఫీలు తీసుకొనేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకుండగా భావోద్వేగానికి గురయ్యారు. ఆర్యన్ చేతిని ముద్దాడిండు. ఆర్యన్ తో సెల్ఫీ కూడా దిగాడు. ఏ మాత్రం అభిమానులను నిరుత్సాహపరచకుండా ఆర్యన్ ఖాన్ అభిమానులతో సెల్ఫీలు దిగుతున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ముంబాయి ఎయిర్ పోర్టులో బ్లూ రంగులో ఉన్న రౌండ్ నెక్ టీ షర్ట్ ధరించి.. పైన జాకెట్, బ్లాక్ కలర్ కార్గో ప్యాంట్ ధరించి స్టైల్ గా నడుచుకుంటూ వెళ్లాడు. ఆర్యన్ ఖాన్.. తన ఇన్ స్ట్రాగ్రామ్ లో ‘అడిడాస్ కోసం ఫొటో షూట్ దిగాడు.  దీనిపై తండ్రి షారుఖ్ ఖాన్ స్పందించారు. చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ముంబై తీరంలో గోవాకు వెళ్తున్న క్రూయిజ్ షిప్‌పై దాడి చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు.. ఆర్యన్ ఖాన్ ను గత ఏడాది అక్టోబర్ 3న అరెస్టు చేశారు. ఆర్యన్.. కొన్ని రోజుల పాటు జైలు శిక్షను కూడా అనుభవించి.. ఇటీవలే బెయిల్ పై బయటికొచ్చాడు. మేలో దాఖలు చేసిన చార్జిషీట్‌లో దర్యాప్తు ఏజెన్సీ అతన్ని నిందితుడిగా పేర్కొనలేదు. "తగిన సాక్ష్యాలు లేనందున" ఆర్యన్ ఖాన్ తో పాటు, మరో ఐదుగురిని కూడా NCB విడిచిపెట్టింది.