ఫ్యాన్సీ నెంబర్లతో ఒక్కరోజే 45 కోట్ల ఇన్ కం

ఫ్యాన్సీ నెంబర్లతో ఒక్కరోజే 45 కోట్ల ఇన్ కం

హైదరాబాద్, వెలుగు :  ఫ్యాన్సీ నంబర్లతో  రాష్ట్ర రవాణా శాఖకు కాసుల పంట పండింది. సోమవారం ఒక్కరోజే ఖైరతాబాద్ ఆర్టీఏ సెంట్రల్​ జోన్​కార్యాలయానికి ఫ్యాన్సీ నంబర్లతో రూ.45.98 లక్షల ఇన్ కం వచ్చింది. వేలంలో పలువురు వాహన యజమానులు పోటీపడి మరీ ఫ్యాన్సీ నంబర్లను కైవసం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కీన్టోన్​ ఇన్​ఫ్రా ప్రైవేట్​ లిమిటెడ్​ సంస్థ అధినేత అత్యధికంగా రూ. 17.35 లక్షలు చెల్లించి టీఎస్ 09 జీఈ​9999  నెంబర్​ను దక్కించుకున్నారు.

అలాగే.. టీఎస్​09జీఎఫ్​ 0005 నెంబర్ ద్వారా  రవాణా శాఖకు 3.75 లక్షలు సమకూరాయి. టీఎస్​09 జీఎఫ్​0001 నెంబర్ ద్వారా3.50 లక్షలు, టీఎస్​09 జీఎఫ్​0099 నెంబర్​ద్వారా రూ. 2.31 లక్షల ఆదాయం వచ్చింది.  టీఎస్​09 జీఎఫ్0111 నెంబర్ ద్వారా​2.09 లక్షలు, టీఎస్​09 జీఈ 0027 నెంబర్ ద్వారా 1.36 లక్షలు, టీఎస్​09 జీఎఫ్​0007 నెంబర్ ద్వారా 1.01 లక్షల ఇన్ కం వచ్చిందని అధికారులుపేర్కొన్నారు.