ప్రళయ Fani : తీరం దాటే వేళ ఒడిశాలో బీభత్సం

ప్రళయ Fani : తీరం దాటే వేళ ఒడిశాలో బీభత్సం

Fani తుఫాన్ ఒడిశాలో భారీ నష్టాన్ని కలిగించింది. భువనేశ్వర్ , పూరీలపై తీవ్రప్రభావం కనిపిస్తోందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఒడిశాలో ముగ్గురు చనిపోయారని చెప్పారు. తుఫాను పూరీ పట్టణానికి దగ్గరగా తీరం దాటేవేళ ప్రళయమే వచ్చిందా అన్నంతగా అత్యంత భారీస్థాయిలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.

భువనేశ్వర్ లోని ఎయిమ్స్ హాస్టల్ రూమ్ పైకప్పు గాలికి ఎగిరిపోయింది. భువనేశ్వర్ ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ బాగా దెబ్బతిన్నాయి.

భువనేశ్వర్ నుంచి వెళ్లే అన్ని విమానాలు రద్దయ్యాయి.

భారీ చెట్లు కూలి.. రోడ్లకు అడ్డంగా పడిపోయాయి. పట్టణాల్లో కూలిన చెట్లు ఇళ్లపై పడటంతో.. గోడలు కూలిపోయాయి.

టెంపుల్ టౌన్ పూరీ, ఇతర ఊళ్లన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. గడిచిన 20 ఏళ్లలో ఇదే అతిపెద్ద తుఫాన్ అని అధికారులు చెబుతున్నారు.

ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లింది. పునరావాస శిబిరాల్లో వారికి ఆహారం, ఇతర వసతులు కల్పించారు. పునారావాస శిబిరాల్లో ఉన్న వారిలో 600 మంది గర్భిణిలు ఉన్నారు.

NDRF, కోస్టల్ నేవీ దళాలు సహాయ కార్యక్రమాల్లో క్షణం తీరికలేకుండా పనిచేస్తున్నాయి.