యశ్ ఇంటి ముందు భారీగా క్యూ కట్టిన అభిమానులు

యశ్ ఇంటి ముందు భారీగా క్యూ కట్టిన అభిమానులు

కేజీఎఫ్ తో నేషనల్ వైడ్ గా స్టార్ డమ్ తెచ్చుకున్న  హీరో  యశ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  అయితే తన అభిమాన హీరో  రాకీ భాయ్ ను చూసేందుకు అభిమానులు ఆయన ఇంటి వద్ద బారులు తీరారు. యశ్ తో ఫోటో దిగేందుకు క్యూ లో నిలబడి ఎదురు చూస్తున్నారు. యశ్ కూడా తన అభిమానులను నిరాశపెట్టడం ఇష్టం లేక  ఓపిగ్గా అందరితో  ఫోటోలు దిగారు.  ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  కేజీఎఫ్ 2 ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.