AP: ఫిట్మెంట్ పై చర్చకు అనుమతించకపోవడం సరికాదు

AP: ఫిట్మెంట్ పై చర్చకు అనుమతించకపోవడం సరికాదు
  • మంత్రివర్గ కమిటీ తీరుపై FAPTO నిరసన
  • రేపట్నుంచి వారం రోజులు నల్ల బ్యాడ్జీలతో విధులు
  • కలసి వచ్చే సంఘాలతో కలసి దశలవారీ పోరాటానికి పిలుపు

అమరావతి: పీఆర్సీ రద్దు కోసం ఆందోళన చేపట్టిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చల సందర్భంగా ఫిట్మెంట్ పై చర్చకు అనుమతించకపోవడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గ కమిటీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఫ్యాప్టో (FAPTO)రేపు సోమవారం నుంచి వారం రోజులపాటు నిరసనలకు పిలుపునిచ్చింది. ప్రజాస్వామ్య బద్దంగా నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలని నిర్ణయించింది. 
ఆదివారం ఫ్యాప్టో ( FAPTO) చైర్మన్ సీహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు అధ్యక్షతన  రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సెక్రటరీ జనరల్  శరత్ చంద్ర, కో చైర్మన్ ఎన్. వెంకటేశ్వర్లు, కె. భాను మూర్తి, కె..కుల శేఖర్ రెడ్డి, వెలమల శ్రీనివాసరావు , అదనపు ప్రధాన కార్య దర్శి ఎన్వీ రమణయ్య, సీహెచ్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి కె.ప్రకాష్ రావు, కోశాధికారి  జి.శౌరి రాయులు, ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె ఎస్ ఏస్ ప్రసాద్ , మల్లు రఘునాథరెడ్డి , పి పాండురంగ వరప్రసాద్ , జి హృదయరాజు, కె నరహరి పర్రె వెంకటరావు ,మద్ది రాజేంద్ర ప్రసాద్ , ఏజీఎస్ గణపతి , నరోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో చర్చల తీరుపై సమీక్షించారు. కొత్త పీఆర్సీ ని రద్దు చేయాలని, అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ బహిర్గత పరచాలని డిమాండ్ చేస్తూ.. పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో చేసిన పోరాటకార్య క్రమాలకు స్పందించి ఈనెల 4, 5వ తేదీలలో జరిగిన చర్చలలో ఫిట్మెంట్ పెంపుదల పై చర్చకు అనుమతి ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండి స్తున్నామని  ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం జరిపిన చర్చలలో ఉపాధ్యాయులకు, సీపీఎస్ సమస్యలు, కాంట్రాక్టు, ఔటసోర్స్, గ్రామ సచివాలయ ఉద్యోగుల  సమస్యల ప్రస్తావన లేకపోవడాన్ని సరికాదని నిరసన వ్యక్తం చేశారు. పీఆర్సీలో 27 శాతం కంటే ఎక్కువగా ఫిట్మెంట్  సాధనకు CPS రద్దుకోసం ,ఇతర సమస్యల పరిష్కారానికి  దశల వారి పోరాటానికి పిలుపు నిచ్చారు. ఈ పోరాటంలో కలిసి వచ్చే సంఘాలను కలుపుకుని ఐక్యవేదిక ఏర్పాటు చేస్తామని తెలిపారు. 
మొదటి దశ పోరాట కార్యాచరణ
7 . 02 . 2022 నుండి వారం రోజుల పాటు నల్ల బ్యాడ్జస్ ధరించి విధులకు హాజరు.
11 . 02 . 2022 న 13 జిల్లాల కలక్టర్ లకు వినతిపత్రాల సమర్పించుట.
12 .02 .2022 న కలిసి వచ్చే ఉద్యోగ , ఉపాధ్యాయ సంఘాలతో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం.

 

 

ఇవి కూడా చదవండి...

ఇండియాలో కొత్త ట్రెండ్.. ఆ కంపెనీలో వీక్లీ శాలరీ

ప్రభుత్వ ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట దక్కలేదు

రాజ్యాంగాన్ని కాదు..రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలి