ఇండియాలో కొత్త ట్రెండ్.. ఆ కంపెనీలో వీక్లీ శాలరీ

ఇండియాలో కొత్త ట్రెండ్.. ఆ కంపెనీలో వీక్లీ శాలరీ

అందరికీ శాలరీ అంటే ఎప్పుడొస్తుంది. చాలా మందికి అసలు ఇదొక ప్రశ్నా అని అనిపించొచ్చు. సరే మన దేశంలో ఎక్కువ కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన ముందు నెల వర్క్‌కు సంబంధించిన జీతాన్ని ఉద్యోగి అకౌంట్‌లో డిపాజిట్‌ చేస్తాయి. కొన్ని కంపెనీలు జీతాన్ని ఆ నెల చివరి రోజునే ఇచ్చేస్తాయి. కొన్ని కంపెనీలు మాత్రం ఒకటో తేదీ దాటిపోయాక ఆలస్యంగా కొన్ని రోజులకు జీతాలు వేస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. మన దేశంలో జీతమంటే నెలకోసారి వస్తది. అంతే కదా!! కానీ ఈ ట్రెండ్‌ను మారుస్తూ మన దేశంలోని ఒక కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఉద్యోగులకు వారానికోసారి జీతం చెల్లించే పాలసీని ఎంచుకుంది. అమెరికా సహా కొన్ని విదేశాల్లో ఉన్న విధానాన్ని మన దేశానికి కూడా పరిచయం చేస్తున్న ఆ కంపెనీ.. దేశీయ బీ టూ బీ ఈ కామర్స్ సంస్థ ఇండియా మార్ట్‌.

 

With an aim to build a flexible work culture and ensure the financial wellness of our employees, IndiaMART becomes the...

Posted by IndiaMART on Saturday, February 5, 2022

ఫేస్‌బుక్‌లో పోస్ట్‌..

ఇండియా మార్ట్‌ తన ఉద్యోగులకు ఇకపై నెల వారీగా కాకుండా వారం వారం జీతాలను చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. వారానికోసారి జీతాలు ఇవ్వడం ద్వారా ఉద్యోగులకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉంటాయని, దీంతో వాళ్ల ప్రశాంతంగా పని చేయగలుగుతారని, తద్వారా వర్క్‌ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుందని కంపెనీ ఆ పోస్ట్‌లో పేర్కొంది. మన దేశంలో వీక్లీ శాలరీ విధానాన్ని తీసుకొస్తున్న తొలి కంపెనీ తమదేనని వెల్లడించింది.

మరిన్ని వార్తల కోసం..

లతా మంగేష్కర్ చివరిగా పాడిన పాట ఇదే

లతా మంగేష్కర్ తెలుగులో పాడిన పాటలు ఇవే

రోజూ నిద్రలేవగానే లతా దీదీ మొఖమే చూసేవాడ్ని