ప్రభుత్వ ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట దక్కలేదు

ప్రభుత్వ ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట దక్కలేదు
  • ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు
  • జనసేన అధినేత పవన్ కళ్యాణ్

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట దక్కలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  జీత భత్యాలకు సంబంధించిన డిమాండ్ల పరిష్కారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుధ్ది లేకుండా ఆధిపత్య ధోరణిలోనే వెళ్లిందని ఆయన విమర్శించారు. ఫిట్మెంట్, గత హెచ్.ఆర్.ఏ. కొనసాగింపు, అశుతోష్ మిశ్రా నివేదిక ఇవ్వడం లాంటి ప్రధాన డిమాండ్లతో విజయవాడలో ఉద్యోగులు ఉవ్వెత్తున చేసిన భారీ ర్యాలీ ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేసిందన్నారు. 
‘ఇవేవీ నెరవేరకుండానే... ఐ.ఆర్. హెచ్.ఆర్.ఏ., క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రికవరీని పాక్షికంగా చేసినా సరే సమ్మె ఉపసంహరించుకొని, ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాల్సిన పరిస్థితిని పి.ఆర్.సి. స్టీరింగ్ కమిటీ నాయకులకు ప్రభుత్వం కల్పించింది. ఈ ఉపసంహరణ ప్రకటనపై ఉపాధ్యాయ సంఘాలు విభేదించిన విషయాన్ని, వారు ప్రస్తావిస్తున్న అంశాలను జనసేన పరిగణనలోకి తీసుకొంటుంది. ప్రభుత్వ వైఖరితో నష్టపోయిన ఉద్యోగ వర్గంపట్ల జనసేన పార్టీ సానుకూల దృక్పథాన్ని కనబరుస్తూ, వారి భావోద్వేగాలకు విలువ ఇస్తుంది..’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండి...

రాజ్యాంగాన్ని కాదు..రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలి

సంగీత ప్రపంచానికి ఆమె లేని లోటు తీర్చలేనిది: ఏఆర్ రెహ్మాన్

ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పిన మెగాస్టార్