
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి భయంతో చాలా దేశాలు ట్రావెల్ ఆంక్షలు పెడుతున్నయ్. ఇంటర్నేష నల్ ఫ్లైట్లను తమ దేశంలోకి రానివ్వట్లేదు. మిగిలిన దేశాలకు వెళ్లే ప్రయాణికులు మాత్రం నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఫ్లైట్ టికెట్ రేట్లను ఎయిర్‌లైన్స్ సంస్థలు అడ్డగోలుగా పెంచడమే దీనికి కారణం. కొన్ని రూట్లలో అయితే టికెట్ రేట్ ఏకంగా వంద శాతం పెంచేశాయి. అదేమంటే ప్రయాణికులను సేఫ్‌గా తీసుకెళ్లడానికి, విదేశాలు పెట్టిన కండీషన్లకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడానికి ఖర్చవుతోందని ఆయా కంపెనీల ప్రతినిధులు చెప్తున్నారు. గతంలో రూ.80 వేలకు కాస్త అటూఇటూగా ఉన్న ఢిల్లీ- టొరంటో ఫ్లైట్ టికెట్ ధర ఇప్పుడు రూ.2.37 లక్షలకు చేరింది. ఢిల్లీ నుంచి లండన్‌కు టికెట్ ధర గతంలో రూ.60 వేలు ఉండగా.. ఇప్పుడది రూ.1.2 లక్షలకు పెరిగింది.