సిగ్మా జర్నీ చాలా స్పెషల్ 

సిగ్మా జర్నీ చాలా స్పెషల్ 

బ్యాక్ టు బ్యాక్  సినిమాలు చేస్తూ టాలీవుడ్‌‌లో మంచి గుర్తింపును తెచ్చుకున్న  ఫరియా అబ్దుల్లా.. ‘సిగ్మా’ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి జేసన్ సంజయ్ దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. అక్టోబర్ 2న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. 

ఈ సందర్భంగా ఫరియా అబ్డుల్లా చెప్పిన విశేషాలు: 

‘‘యాక్షన్, అడ్వెంచర్, హీస్ట్, కామెడీ అంశాలతో రూపొందిన మంచి ఎంటర్‌‌‌‌టైనర్ ఇది. లైకా ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బ్యానర్ ద్వారా తమిళ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది. ఈ మూవీ జర్నీ నాకు చాలా స్పెషల్.  ఇందులో నేను రేడియో జాకీగా కనిపిస్తా. అన్ని రకాల ఎమోషన్స్‌‌ను పండించే అవకాశం లభించింది. సందీప్ కిషన్, నేను కలిసి సినిమా చేయాలని చాలా కాలంగా అనుకున్నాం. ఈ మూవీతో అది నెరవేరింది. 

ఇందులో మా  ఇద్దరి పాత్రల్లో చాలా కొత్తదనం ఉంటుంది. తొలి సినిమానే అయినప్పటికీ జేసన్‌‌కు దర్శకత్వంపై మంచి కమాండ్ ఉంది.  సీఎం విజయ్ కొడుకు అయినప్పటికీ చాలా వినయంగా, అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు.  తమన్ అందించిన బ్యాక్‌‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్‌‌లో ఉంటుంది. క్లైమాక్స్‌‌లో వచ్చే ‘సిగ్మా’ స్టైల్ పాటను చాలా ఎంజాయ్ చేస్తూ చేశా.

ప్రేక్షకుల ఆదరణ లభిస్తే ‘సిగ్మా 2’ కూడా చేస్తాం.  భవిష్యత్తులో దర్శకత్వం చేయాలనే ఆసక్తి ఉంది.  ప్రస్తుతం కొన్ని కథలు రాస్తున్నా. అయితే డైరెక్షన్‌‌కు  ఇంకా సమయం ఉంది’’.