రైతుబంధు రాలేదని..రైతు ఆత్మహత్య

రైతుబంధు రాలేదని..రైతు ఆత్మహత్య

రైతు బంధు డబ్బులు రాకపోవడంతో  మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుమ్రుంభీం జిల్లా కెరమెరి మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన జాదవ్ రోహిదాస్.. రైతు బంధు డబ్బులు అందలేదని మనస్థాపంతో సూసైడ్ చేసుకున్నాడు. సర్కార్ తన అకౌంట్ లో వేసిన డబ్బును... క్రాప్ లోను కింద బ్యాంక్ అధికారులు కట్ చేసుకున్నారు. పంటలు వేయడానికి పెట్టుబడి లేకపోవడంతో.. మనస్థాపంతో సూసైడ్ నోట్ రాసి.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల జిల్లాలోని నార్నూర్ మండలంలో రైతుబంధు డబ్బులు కోసం రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.