పిడుగు పడి రైతు మృతి..భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో ఘటన

పిడుగు పడి రైతు మృతి..భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో ఘటన

అశ్వారావుపేట, వెలుగు : పిడుగు పడి ఓ రైతు చనిపోయాడు. ఈ ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గుమ్మడవల్లి గ్రామానికి చెందిన సాధనం రాజారావు (50) తన పొలంలో కూరగాయలు సాగు చేస్తూ జీవిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం తోటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది.

దీంతో రాజారావు పక్కనే ఉన్న వేపచెట్టు కింద నిల్చున్నాడు. అదే టైంలో చెట్టుపై పిడుగు పడడంతో రాజారావు అక్కడికక్కడే పడిపోయాడు. గమనించిన ఇద్దరు యువకులు గ్రామంలోకి వెళ్లి తడి కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. వారంతా ఘటనాస్థలానికి వచ్చి చూసేసరికి రాజారావు చనిపోయి కనిపించాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.