వాగు దాటుతూ .. రైతు మృతి..కుమ్రం భీమ్ జిల్లాలోని చితకర్ర వాగు దగ్గర ప్రమాదం

వాగు దాటుతూ .. రైతు మృతి..కుమ్రం భీమ్ జిల్లాలోని చితకర్ర వాగు దగ్గర ప్రమాదం

జైనూర్, వెలుగు: వాగులో కొట్టుకుపోయి రైతు మృతి చెందిన ఘటన కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది.  గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. జైనూర్ మండలం చితకర్ర పంచాయతీ కిసాన్ నాయక్ తండాకు చెందిన జాదవ్ ఖన్నిరామ్(63), సరస్వతి దంపతులు తమ కొడుకు అభినంద్‌‌తో కలిసి ఆదివారం పత్తి చేను వద్దకు వెళ్లారు. 

కోతుల బెడద కారణంగా రోజూ ఖన్నిరామ్ చేను వద్ద కాపలాగా ఉండేవాడు. కాగా.. అమావాస్య రోజు కావడంతో ముగ్గురూ ఇంటికి వెళ్లేందుకు చితకర్ర వాగు దాటుతుండగా, ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది. దీంతో ఖన్నిరామ్  ప్రవాహంలో కొట్టుకుపోయాడు. 

భార్య, కొడుకు కష్టపడి వాగు దాటారు. సోమవారం పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి వెళ్లి డెడ్ బాడీని బయటకు తీశారు. తహసీల్దార్ అడా భీర్శావ్ పంచనామా చేశారు. ఖన్నిరామ్ మృతితో తండాలో విషాదం నెలకొంది.