త్వరలో రైతు రుణమాఫీ

త్వరలో రైతు రుణమాఫీ

మంత్రి హరీశ్ రావు ఇవాళ(సోమవారం) సిద్దిపేట జిల్లాలోని ములుగు కొండలక్ష్మన్ హార్టికల్చర్ యూనివర్శిటీల్లో యూనియన్ బ్యాంక్ ములుగు బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. త్వరలో రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రైతు బంధు, ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా బ్యాంక్‌లు సహకరించాలన్నారు.

త్వరలో ఫారెస్ట్ కాలేజీని ఫారెస్ట్ వర్శిటీ చేసే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలిపారు హరీశ్. ఫారెస్ట్ కాలేజీ విద్యార్థులకు ఉపయోగపడేలా కళాశాలలో ATM ఏర్పాటు చేయాలని అన్నారు. వాహనదారుల కోసం రోడ్డు ప్రక్కన కూడా ATM ఏర్పాటుకు యూనివర్శిటీ వారు బ్యాంక్ వారికి సహకరించాలని మంత్రి హరీశ్ రావు సూచించారు.