వికారాబాద్, వెలుగు: ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉంటాయని, ఆ తరువాత ప్రజాప్రతినిధులు అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో సర్పంచ్‌లు, వార్డుమెంబర్లుగా గెలిచిన వారు సోమవారం ఆయనను క్యాంప్‌ఆఫీస్‌లో కలిశారు. ఈ సందర్భంగా వారిని స్పీకర్ శాలువాలతో సన్మానించారు. పదవీ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, శంకర్, నాయకులు చీమలదరి నరోత్తంరెడ్డి, వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
