నా భూమి కబ్జా చేసి చంపుతామని బెదిరిస్తున్రు

V6 Velugu Posted on Jun 15, 2021


శాయంపేట, వెలుగు: తనకు వారసత్వంగా వచ్చిన భూమిని పక్కపొలం యజమాని, అతని బంధువులు కబ్జా చేశారని.. తన భూమిని తనకు ఇప్పించాలని వేడుకుంటూ ఓ రైతు జడ్పీ చైర్​ పర్సన్​ కాళ్ల మీద పడ్డాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ ​రూరల్​ జిల్లా మైలారం గ్రామానికి చెందిన అరికిళ్ల సుధాకర్​కి సర్వే నంబర్ 630/ సి/1, 630/ డిలో 1.5 ఎకరం భూమి ఉంది. సుధాకర్.. బుర్ర మల్లయ్య అనే రైతుతో కలిసి వ్యవసాయ బావి తవ్వించి సాగు చేసుకుంటున్నాడు. కాగా సుధాకర్​పొలంలో నుంచి ఎస్సారెస్పీ కెనాల్ వెళ్లడంతో ప్రభుత్వం పంపిణీ చేసిన కొత్త పట్టా పాస్ బుక్​లో అధికారులు కేవలం ఎకరం భూమి ఉన్నట్లు నమోదు చేశారు. ఇదిలా ఉండగా పక్క పొలం రైతు అయిన అరికిల్ల వీరయ్య, అతని కుటుంబ సభ్యులు గతంలో పాతిన హద్దు రాళ్లను పీకి సుధాకర్​పొలంలోకి పాతారు. ఇదేందని అడిగిన సుధాకర్​పై బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో తన పొలాన్ని సర్వే చేయాలని 3 నెలల క్రితం మీసేవలో దరఖాస్తు పెట్టుకున్నా అధికారులు పట్టించుకోలేదు. ఇటీవల పత్తి గింజలు నాటేందుకు పొలం వద్దకు వెళ్లిన సుధాకర్​ను అరికిల్ల వీరయ్య కొట్టి చంపుతామని బెదిరించినట్లు బాధితుడు ఆరోపించాడు. తన భూమి తనకు ఇప్పించి న్యాయం చేయాలని కోరుతూ సుధాకర్​సోమవారం శాయంపేట జడ్పీచైర్ పర్సన్ గండ్ర జ్యోతి కాళ్ల మీద పడ్డాడు. రైతుతో మాట్లాడిన జ్యోతి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. 
 

Tagged Warangal Rural, farmer pleads, ZP chairman

Latest Videos

Subscribe Now

More News