వీడియో: ప్రాణాలకు తెగించి సింహం నుండి ఆవును కాపాడిన రైతు

వీడియో: ప్రాణాలకు తెగించి సింహం నుండి ఆవును కాపాడిన రైతు

అడవికి రారాజైన 'సింహం' కనపడగానే ఆగకుండా కిలో మీటర్ పరుగెత్తడం సహజం. కానీ ఆ రైతు అలా అనుకోలేదు. తన ప్రాణాలు పెట్టైనా ఆవును రక్షించాలనుకున్నాడు. అందుకోసం తాను ప్రాణాలకు తెగించి పోరాడకపోయినా.. అతడు చూపిన తెగువను మాత్రం మెచ్చుకోవాల్సిందే.

గుజరాత్, గిర్ జిల్లాకు చెందిన ఓ రైతు ఆవును తోలుకుంటూ రోడ్డు వెంబడి నడుస్తున్నాడు. ఆ సమయంలో సింహం ఎక్కడినుండి ఊడిపడిందో కానీ ఉన్నట్టుండి ఆవుపై దాడికి దిగింది. ఆవు దాని నోటి నుండి తప్పించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. పోనీ సింహాన్ని భయపెడదామనుకున్నా.. రైతుకు అక్కడ సరైన వస్తువు ఏదీ కనిపించలేదు. అలా అని అతను తన ప్రయత్నాన్ని ఆపలేదు. ఏదో వస్తువు తీసుకున్నట్లు నటించి చేయి పైకెత్తి సింహం వైపు నడుస్తాడు. దీంతో భయపడిపోయిన సింహం అక్కడినుండి పరుగులు తీసింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ગીર સોમનાથ જિલ્લાના આલીદર ગામે સિંહણ દ્વારા ગાય ઉપર હુમલો કરેલ ત્યારે ખેડૂતે #Credit કિરીટસિંહ ચૌહાણ પોતાની ગાયને એક ખમીરવંતો પ્રયાસ કરેલ અને સફળતા મળેલ.
ખુબ ખુબ સલામ#lion #animalattack #cow #lioness #kingofthejungle #hunt #wildlife #india #nationalgeographic #discovery pic.twitter.com/lDYGub9bfZ

— Vivek Kotadiya?? BJP (@VivekKotdiya) June 29, 2023