అక్రమ ఇసుక రవాణాపై రైతుల ఆగ్రహం

అక్రమ ఇసుక రవాణాపై రైతుల ఆగ్రహం

నల్లగొండ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ ఇసుక రవాణాన్ని అడ్డుకొని అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అందులో భాగంగా నార్కట్ పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలో మోత్కూర్- నార్కట్ పల్లి రోడ్డుపై ఎడ్ల బండ్లతో రైతుల ధర్నాచేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మూసీ వాగుపై అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఇసుక అక్రమ రవాణా వల్ల గ్రామంలో భూగర్భ జలాలు తగ్గడమే కాకుండా పిల్లలు తాగుడుకు బానిసై పక్కదారి పడుతున్నారని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి, అక్రమ ఇసుక తరలించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గంటకు పైగా రోడ్డుకి అడ్డంగా ఎడ్లబండ్లు పెట్టి రైతులు ఆందోళన చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.