గన్నీ బ్యాగుల కొరతతో రైతుల ఇబ్బందులు

గన్నీ బ్యాగుల కొరతతో రైతుల ఇబ్బందులు

రాష్ట్రంలో  ఐకేపి సెంటర్లు,  గన్నీ బ్యాగుల  కొరత  తీవ్రంగా ఉంది.  అక్టోబర్ ఫస్ట్  వీక్ నుంచే కోతలు  మొదలైనా.. అందుకు  తగినట్టుగా  ఏర్పాట్లు చేయలేదు  సర్కార్.  గన్నీ బ్యాగుల కొనుగోలు  కూడా ఇంకా  ఆర్డర్ పెట్టలేదు.   వానాకాలం పంటకు  25 కోట్లకు పైగా  గన్నీలు అవసరం  ఉండగా.. పాతవి  2కోట్లే   ఉన్నాయి. సర్కార్ కు  ముందస్తు ప్లానింగ్  లేకపోవడంతో.. రైతుల పాలిట శాపంగా  మారుతోంది.

యాసంగి, వానకాలం.. కాలమేదైనా కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఐకేపి సెంటర్లు, గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. సర్కార్ కు ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో.. రైతుల పాలిట శాపంగా మారుతోంది. అప్పులు చేసి వ్యవసాయం చేయడం ఒకెత్తైతే, ఆరుగాలం కష్టపడిన శ్రమ వృధా అయ్యేలా అధికారులు వ్యవహరించడం ఇబ్బందిగా మారిందంటున్నారు రైతులు.

 అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచే కోతలు మొదలైనా అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేయలేదు సివిల్ సప్లై అధికారులు. అన్నింటికంటే ముందుగా గన్నీలు ఎంత అవసరం..ప్రస్తుతం ఉన్న సంఖ్యపై ఎలాంటి సమీక్ష చేయలేదు. ఈ సీజన్ కు 25 కోట్ల బ్యాగులు అవసరం ఉండగా.. పాతవి 2 కోట్లే ఉన్నాయి. అవసరమయ్యేవాటిలో సగం అంటే 12కోట్ల పాత గన్నీ బ్యాగులు అవసరం.. కానీ అవి లేకపోవడంతో రేషన్ డీలర్ల నుంచి కొంత తెప్పిస్తున్నారు. 10 కోట్ల కొత్త గన్నీ బ్యాగులు వస్తున్నాయనీ..మరో 4 కోట్లమేర టెండర్ పెట్టామనీ అధికార యంత్రాంగం చెబుతోంది. కానీ రెండు మూడు నెలలముందే ఈ పనిచేయాల్సి వున్నా.. ఆలస్యం కావడంతో రైతులకు ఇబ్బందిగా మారబోతోంది. టెండర్ వేసిన సంచులు రావడం, అవి రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లోని సెంటర్లకు పంపడం..ఇదంతా జరగడానికి ఎంత కాలం పడుతుందోనన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కోతలు మొదలై దాదాపు నెల గడవటంతో.. ఐకేపీ సెంటర్లకు ధాన్యం వస్తోంది. మిగతా జిల్లాల్లోనూ కోతలు మొదలై రెండు వారాలు కావస్తోంది.

పంటకు అనుగుణంగా రాష్ట్రంలో దాదాపు 8వేలకు వరకు ఐకేపి సెంటర్లు ఏర్పాటు కావాల్సివుంది. కానీ వందల సంఖ్యలో కూడా ఏర్పాటు కాలేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మునుగోడు ఉపఎన్నికపై ఫోకస్ పెట్టింది. మంత్రి గంగులతో  పాటు మిగతా డిపార్ట్ మెంట్ అధికారులు కూడా..  ధాన్యం కోనుగోలు, సెంటర్ల ఏర్పాటు, జూట్ కార్పోరేషన్ కు కూడా ఇండెండ్ ఆలస్యంగా పెట్టారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.