అన్నం పెట్టే అన్నదాతకు అండగా నిలుద్దాం.. బాలీవుడ్ ప్రముఖుల ట్వీట్లు

V6 Velugu Posted on Dec 07, 2020

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. అన్నదాతల నిరసనలకు సినీ ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు.  బాలీవుడ్ హీరోయిన్స్ ప్రియాంక చోప్రా, తాప్సీ పన్ను, హీరో రితేష్ దేశ్‌‌ముఖ్, డైరెక్టర్స్ హన్సల్ మెహ్తా, అనుభవ్ సిన్హా రైతులకు మద్దతిస్తూ ట్వీట్లు చేశారు.

‘రైతులే భారత ఆహార సైనికులు. వాళ్ల భయాలను తొలగించాలి. వాళ్ల ఆశలను తీర్చాలి. అభివృద్ధి చెందుతున్న ఈ ప్రజాస్వామ్యంలో రైతు సంక్షోభాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి’ అని ప్రియాంక చోప్రా ట్వీట్ చేశారు.

రైతులకు మద్దతుగా నిలుద్దామంటూ తాప్సీ పలు ట్వీట్స్ చేసింది.

‘మీరు ఇవ్వాళ భోజనం చేస్తున్నారంటే రైతుకు థ్యాంక్స్ చెప్పాలి. దేశంలోని అన్నదాతలకు సంఘీభావంగా నిలుద్దాం’ అని రితేష్ పిలుపునిచ్చారు.

రైతులకు మద్దతుగా నిలుద్దాం అంటూ హన్సల్ మెహ్తా ట్వీట్ చేశారు.

జో బోలె సో నిహాల్ (ఎవరు ఉచ్ఛరిస్తారో వారిదే విజయం) అంటూ రైతు నిరసనలకు మద్దతుగా అనుభవ్ సిన్హా ట్వీట్ చేశారు.

Tagged new agricultural laws, Tweets, Celebrities, support, formers protest

Latest Videos

Subscribe Now

More News