క్వింటా పసుపు 13000 .. అనందంలో నిజామాబాద్ రైతులు

క్వింటా పసుపు 13000 .. అనందంలో నిజామాబాద్ రైతులు

నిజామాబాద్ జిల్లా పసుపు పంటకు పెట్టింది పేరు. తొమ్మిది నెలల పంట చేతికందడంతో పసుపు తవ్వకాల్లో జిల్లా రైతులు నిమగ్నయ్యారు. పచ్చ బంగారంగా పిలుచుకునే ఈ పంటకు ఈసారి మార్కెట్లో మంచి ధర ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గతేడాది క్వింటాల్ పసుపు ధర రూ. 7 వేల నుంచి రూ.9 వేలు పలకగా, ఈ సారి రూ.12వేల నుంచి రూ.13వేల వరకు ఉందని రైతులు చెబుతున్నారు.

నిజామాబాద్ ఫొటోగ్రాఫర్, వెలుగు