
- అభిప్రాయాలు వ్యక్తం చేసిన పలువురు రైతులు
కొడంగల్, వెలుగు: పడావు పడిన భూములకు రైతు భరోసా ఇవ్వొద్దని పలువురు రైతులు అభిప్రాయప్డడారు. మంగళవారం కొడంగల్ పీఎసీఎస్ఆఫీస్లో ప్రెసిడెంట్శివకుమార్, ఎంపీపీ ముద్దప్ప అధ్యక్షతన అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
రైతు భరోసాపై అభిప్రాయాలు సేకరించారు.10 ఎకరాలలోపు వారికే రైతు భరోసా ఇవ్వాలని, వెంచర్లకు, గుట్టలకు ఇవ్వొద్దని రైతులు పేర్కొన్నారు. అదేవిధంగా పెట్టుబడి సాయం త్వరగా అందేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో ఏడీఏ శంకర్రాథోడ్, ఏఓ లావణ్య ఉన్నారు.