TRS ప్రభుత్వ తీరుపై రైతులు విసిగిపోయారు: జగ్గారెడ్డి

TRS ప్రభుత్వ తీరుపై రైతులు విసిగిపోయారు: జగ్గారెడ్డి

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుపట్ల రైతులు విసిగిపోయారని ఆరోపించారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. రైతులను బానిసలుగా మార్చే పరిస్థితి వచ్చిందని, మెజార్టీ రైతులకు ఇప్పటి వరకు రైతుబంధు రాలేదన్నారు. పంట నష్టపోయిన రైతులను ఇప్పటి వరకు ఆదుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

PCC చీఫ్ ఎవరు అనేదానిపై మాట్లాడిన జగ్గారెడ్డి…వచ్చే ఎన్నికల వరకు ఉత్తమ్‌ను పీసీసీ చీఫ్‌గా కొనసాగించాలని, పైరవీ చేసుకుంటే PCC పదవి రాదన్నారు. పైరవీదారులకు PCC ఇస్తే పార్టీ దెబ్బతింటుందని, ఉత్తమ్ ఎవరి పేరు చెబితే వాళ్లే PCC చీఫ్‌ అవుతారనేది వాస్తవమన్నారు. జానారెడ్డి, షబ్బీర్‌అలీ, చిన్నారెడ్డి పీసీసీ రేసులో ఉన్నారని జగ్గారెడ్డి తెలిపారు. ఫిరాయింపుల విషయంలో ఏ పార్టీకి నైతిక విలువలు లేవని, పార్టీ ఫిరాయింపులపై తమ పార్టీ మాట్లాడినా తప్పే అని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ AICC పగ్గాలు చేపట్టి దేశవ్యాప్తంగా పర్యటించాలన్నారు జగ్గారెడ్డి.