కరెంట్ ఇస్తలేరని ఆఫీసర్లను సబ్ స్టేషన్లో నిర్భంధించిన్రు

కరెంట్ ఇస్తలేరని ఆఫీసర్లను సబ్ స్టేషన్లో నిర్భంధించిన్రు

భైంసా, వెలుగు; వ్యవసాయానికి నిరంతర కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయంటూ నిర్మల్ జిల్లాలో రైతులు ఆఫీసర్లను  విద్యుత్ సబ్ స్టేషన్లో నిర్భంధించారు.  భైంసా మండలంలోని ఎగ్గాం, కోతుల్గాం, బిజ్జూర్, చింతల్బోరి, మహగాం గ్రామాల రైతులు ముకుమ్మడిగా సబ్ స్టేషన్ కు  వచ్చి ఆఫీసర్లను నిలదీశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము కరెంటు సరఫరా చేస్తున్నామని చెప్పడంతో ఆగ్రహించిన రైతులు ఏఈ ఆదిత్య, లైన్ ఇన్స్పెక్టర్ అన్వర్, సిబ్బంది సుధాకర్లను గదిలో బంధించారు. స్పష్టమైన హామీ వస్తే గానీ బయటకు రానివ్వలేదు. సుమారు 8గంటలకు పైగా బంధించారు. ఈ విషయం తెలుసుకున్న భైంసా రూరల్ పోలీసులు సబ్ స్టేషన్ కు చేరుకోని ఆఫీసర్లు, రైతులతో మాట్లాడారు. ఆఫీసర్లను బయటకు తీసుకోచ్చి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమస్య పరిష్కరిస్తామని, రైతులకు కరెంటు ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పడంతో శాంతించారు.