రైతులు ఆందోళన చెందవద్దు : ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

రైతులు ఆందోళన చెందవద్దు : ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

​నేరడిగొండ, వెలుగు: అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆదిలాబాద్​జిల్లా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భరోసా ఇచ్చారు. శుక్రవారం నేరడిగొండ మండల కేంద్రంలోని జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్​కలెక్టర్​ చిత్రూతో కలిసి సందర్శించారు.

లారీల కొరత కారణంగా ధాన్యం రవాణా నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెప్పడంతో స్పందించిన ఎమ్మెల్యే లారీల యజమానులతో మాట్లాడి, వెంటనే 10 లారీలను కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతమైంది. సర్పంచ్ నీలిమ రెడ్డి, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.