పరిగి, వెలుగు: అక్రమంగా తమ భూములను కాజేసిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ల నుంచి తిరిగి భూములను ఇప్పించాలని రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. సోమవారం కుల్కచర్ల మండలంలోని అంతారం గ్రామానికి చెందన రైతులు కుల్కచర్ల ప్రధాన కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు రైతులు భిక్షాటన చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం కుల్కచర్ల పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2024 నవంబర్లో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు రైతుల భూములను మార్టిగేజ్ చేసి డబ్బులు ఇవ్వమంటే ముఖం చాటేశారని తెలిపారు. తిరిగి తమ భూములను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు.
