ధాన్యం ఆన్ లోడింగ్ లో మిలర్ల నిర్లక్ష్యం.. ట్రాక్టర్లతో మెదక్ హైవేపై బైఠాయించిన రైతులు

ధాన్యం ఆన్ లోడింగ్ లో మిలర్ల నిర్లక్ష్యం.. ట్రాక్టర్లతో  మెదక్ హైవేపై బైఠాయించిన రైతులు

మెదక్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ధాన్యం అన్ లోడింగ్ చేయడంలో మిల్లర్లు అలసత్యం వహిస్తున్నారని ట్రాక్టర్లతో హైవేను దిగ్భందించారు. లోడ్ ట్రాక్టర్లను హైవేపై ఉంచి ధర్నాకు దిగారు.వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. 

ఐకేపీ , సహకారం సంఘాల కొనుగోలు కేంద్రాలనుంచి రైస్ మిల్లులకు తీసుకొచ్చిన ధాన్యాన్ని అన్ లోడ్ చేయడం లేదని బుధవారం (మే20) మెదక్ పట్టణంలో రైతులు ధర్నాకు దిగారు. అక్కన్నపేట మండలానికి చెందిన రైతులు, ట్రాక్టర్ యాజమానులు లోడ్ తో ఉన్న ట్రాక్టర్లను సిద్దిపేట-హన్మకొండ హైవేపు నిలిపి రైతులు బైఠాయించారు.  మిల్లుల్లో కేవలం హుస్నాబాద్ కేంద్రానికి సంబంధించిన ధాన్యాన్ని మాత్రమే దిగుమతి చేసుకుంటూ, అక్కన్నపేట మండలం వడ్లను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.