ఇప్పటికే వందల ఎకరాల భూములిచ్చాం..ఇక ఇయ్యం

ఇప్పటికే వందల ఎకరాల భూములిచ్చాం..ఇక ఇయ్యం

యాదాద్రి, వెలుగు : బస్వాపురం రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యాదగిరిగుట్ట రోడ్డు విస్తరణతో పాటు, కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్ల కోసం ఇప్పటికే వందల ఎకరాలు ఇచ్చాం. ఇప్పుడు రీజినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు కోసం మరోసారి భూములు ఇవ్వలేమని యాదాద్రి జిల్లా రైతులు తేల్చి చెబుతున్నారు. ఇందులో భాగంగా రీజినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు కోసం ఆఫీసర్లు చేపట్టిన సర్వేను అడ్డుకుంటున్నారు. ఎకరం భూమికి ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో కనీసం 200 గజాల స్థలం కూడా రాదని, భూమికి భూమి ఇస్తేనే అప్పుడు తమ భూమి ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తామని స్పష్టం చేస్తున్నారు.

యాదాద్రి జిల్లాలో 1,852 ఎకరాల సేకరణ

యాదాద్రి జిల్లాలోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలాల నుంచి రీజినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు వెళ్తుండగా జిల్లాలో 1,852 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ఇందుకోసం గతనెల 23న గెజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వడంతో ఆఫీసర్లు సర్వే పనులు స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. రీజినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు కోసం రాయగిరిలో 242.10 ఎకరాలు, దాతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో సుమారు 100 ఎకరాల భూములు సేకరించాల్సి వస్తోంది. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు భూములు ఇచ్చాం, ఇప్పుడు ఉన్న భూమి కూడా పోతే తమకు మిగిలేది ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూములు పోకుండా చూడాలని తహసీల్దార్లు, ఎమ్మెల్యేలను కలిసినా ఫలితం లేకపోవడంతో ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 5న కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతిని చుట్టుముట్టారు. బాధితుల సమస్యలను పైఆఫీసర్లకు పంపిస్తామని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హామీ ఇచ్చినా సర్వే పనులు కొనసాగుతూనే ఉండడంతో ఆందోళనకు గురయ్యారు. 

సర్వేను అడ్డుకున్న బాధితులు

యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి, భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరిలో జరుగుతున్న సర్వే పనులను బాధితులు అడ్డుకుంటున్నారు. మంగళవారం భువనగిరి మండలం కేసారం, ఎర్రంబెల్లిలో ఆఫీసర్లు సర్వే చేపట్టగా విషయం తెలుసుకున్న బాధితులు ఆ సర్వేను అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా సర్వే చేస్తారని నిలదీశారు. అనంతరం భువనగిరి తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. బస్వాపురం, బునాదిగాని కాల్వ కోసం ఇప్పటికే భూములు ఇచ్చామని, మరోసారి తమ భూములు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని ప్రశ్నించారు. 

మద్దతు కోసం పార్టీ లీడర్ల వద్దకు..

ఓ పక్క సర్వే పనులను అడ్డుకుంటూనే మరోవైపు రాజకీయ మద్దతు కోసం బాధితులు ప్రయత్నాలు చేస్తున్నారు. భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, గొంగిడి సునీత నుంచి ఎలాంటి సహకారం అందకపోవడంతో ప్రతిపక్ష పార్టీల లీడర్లను కలుస్తున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని ఇప్పటికే కలిసి వినతిపత్రం అందజేశారు. తాజాగా మంగళవారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని మంగళవారం కలిసి తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. దీంతో బాధితులకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.

భూమికి భూమి ఇవ్వాలె

ట్రిపుల్​ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నా భూమి పోతోంది. ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో 200 గజాల స్థలం కూడా రాదు. రాయగిరిలో సేకరిస్తున్న 242.10 ఎకరాల భూమికి పరిహారం ఇవ్వకుండా అంతే భూమిని భువనగిరి మున్సిపాలిటీలోనే సేకరించి ఇవ్వాలి. 

– పసునూరి నాగభూషణం

రియల్టర్ల కోసమే అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్పు ?
రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాపారుల కోసమే రీజినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోడ్డు అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. పాత అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకారం రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలు, వ్యాపారులకు చెందిన భూములు సేకరించాల్సి వస్తోంది. దీంతో రియల్టర్ల ఒత్తిడితోనే అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్చారని అంటున్నారు. రాయగిరి సమీపంలోని రామకృష్ణాపురంలో వందల ఎకరాలు ఖాళీగా ఉన్నాయని, వాటి వైపు కన్నెత్తి చూడని ఆఫీసర్లు చిన్న చిన్న  రైతుల భూములే సేకరించడం సరికాదని ఆవేదన వ్యక్తం 
చేస్తున్నారు.