పట్టాలిచ్చిన తహసీల్దార్ పై పూలవర్షం కురిపించిన రైతులు

పట్టాలిచ్చిన తహసీల్దార్ పై పూలవర్షం కురిపించిన రైతులు

మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామానికి చెందిన రైతులకు పట్టాదారు పాసు బుక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన తహసీల్దార్ రంజిత్‌ కుమార్ పై  రైతులు పూలవర్షం కురిపించారు. 2018 లో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన సంబంధించిన రైతుల పేర్లు మోఖా,సర్వే నంబర్లు, విస్తీర్ణం వివరాల్లో గందరగోళం నెలకొంది. సరిగా లేనందున రైతులకు రైతుబంధు, బీమా పథకాలు అమలు కాలేదు.కాగా గత అసెంబ్లీ ఎన్ని కల సమయంలోఎమ్మెల్యే శంకర్ నాయక్ గ్రామానికి వచ్చినప్పుడు రైతులు ఏ పార్టీ వారు ఇక్కడకు రావొద్దని ముళ్లకంచె వేసి అడ్డుకున్నారు. గెలుపొందిన వెంటనే సమస్య పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ మేరకు రెవెన్యూ ఆఫీసర్లతో గ్రామంలోని భూములపై సర్వే చేయిం చిమొత్తం 1809 మంది రైతులకు గాను 1549 మందికి పట్టాదారు పాసు బుక్కులు సిద్ధంచేశారు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఆఫీసర్లపై అవినీతి విమర్శలు వస్తున్నప్పటికీ చాలెంజ్ గా తీసకుని పాసు బుక్కులను ఆదివారం ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్నాయక్ ఆధ్వర్యం లో అందజేశారు. దీంతో రైతుల ఆనందంతో తహసీల్దార్ రంజిత్​కుమార్ ను భుజాలపై ఎత్తుకుని పూల వర్షం కురిపించా రు. అంనతంర ఎంపీ, ఎమ్మెల్యేను సర్పంచ్ కుమారితో పాటు రైతులు, రెవెన్యూ ఆఫీసర్లు గజమాలతో సన్మానించా రు.