కొనుగోలు కేంద్రం పెట్టి 40రోజులైనా కొంటలేరు

కొనుగోలు కేంద్రం పెట్టి 40రోజులైనా కొంటలేరు
  • కరీంనగర్ జిల్లాలో రైతుల ఆందోళన

కరీంనగర్ జిల్లా  రామడుగు మండలం  దత్తోజిపేట   గ్రామంలో రైతులు  ఆందోళనకు  దిగారు. వడ్ల కోనుగోలులో జాప్యం,  తూకంలో కోతలను వ్యతిరేకిస్తూ  ధర్నా చేపట్టారు. పీఏసీఎస్ ద్వారా  గ్రామంలో  కొనుగోలు కేంద్రం  ఏర్పాటు చేసి 40  రోజులైనా   కొనుగోలు జరగడం  లేదని ఆవేదన  వ్యక్తం చేశారు. ధాన్యం రవాణా చేయాల్సిన లారీలు లేకపోవడం,  గన్ని బ్యాగుల  కొరతతో   వడ్ల కొనుగోలు  ఆలస్యమవుతోందంటున్నారు  రైతులు. 40 కేజీలకు బదులుగా  42 కిలోలు  తూకం వేయడంతో  పాటు.. ధాన్యాన్ని  మిల్లుకు  తీసుకెళ్లాక  కటింగ్ పెట్టినా ఒప్పుకుంటామని  సంతకాలు  తీసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం  చేశారు.

 

 

 

ఇవి కూడా చదవండి

ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్కు బంగారు పతకం

12వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాల్లేవు

ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రానికి వర్ష సూచన