యూరియా కోసం ఆందోళన

యూరియా కోసం ఆందోళన

లక్సెట్టిపేట, వెలుగు: రైతాంగానికి అవసరమైన యూరియాను వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో లక్సెట్టిపేట పట్టణంలోని ఊట్కూర్ చౌరస్తా వద్ద రైతులు సోమవారం రాస్తారోకో నిర్వహించారు. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే యూరియాను అందించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు కోరారు.

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అల సత్వం కారణంగానే రాష్ట్రంలో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ఫైర్​ అయ్యారు. తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ దిలీప్ కుమార్​కు వినతిపత్రం అందజేశారు. నాయకులు నడిపల్లి విజిత్ కుమార్, నల్మాస్ కాంతయ్య, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి , మధు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.