సిద్దిపేట/ చిలప్ చెడ్, వెలుగు: ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ చిన్నకోడూరు మండలం రామంచ వద్ద సిద్దిపేట–సిరిసిల్ల రహదారిపై మంగళవారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో రోజుల తరబడి ఎదురుచూసినా అధికారులు స్పందించడం లేదని రైతులు వాపోయారు.
సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల వద్ద రాజీవ్ రహదారిపై బక్రిచెప్యాల, నాంచారిపల్లికి చెందిన రైతులు రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అధికారులతో మాట్లాడి కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
కొనుగోలు కేంద్రాలకు లారీలు పంపించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం రైతులతో కలిసి మెదక్ జిల్లా చిలప్‌చెడ్ మండలం చిట్కుల్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించారు.
